Share News

JSW Shares: అదృష్టం అంటే ఇతడిదే.. తండ్రి చేసిన పనితో లైఫ్ సెటిల్..

ABN , Publish Date - Jun 09 , 2025 | 07:34 AM

JSW share: తండ్రి ఎప్పుడో చేసిన మంచి పని కారణంగా.. 30 ఏళ్ల తర్వాత కొడుకు జీవితం మారిపోయింది. అతడ్ని రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసింది. ఈ విషయాన్ని ఆ కొడుకే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు.

JSW Shares: అదృష్టం అంటే ఇతడిదే.. తండ్రి చేసిన పనితో లైఫ్ సెటిల్..
JSW share

తండ్రులు చేసిన పాప, పుణ్యాలు పిల్లల జీవితంపై ప్రభావం చూపుతాయంటారు. ఇది నూటికి నూరు శాతం నిజమే అనిపిస్తుంది. 30 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి చేసిన పని .. ఇప్పుడు అతని కుమారుడి జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రి అతడ్ని కోటీశ్వరుడ్ని చేసేసింది. ఒకటి కాదు.. పది కాదు.. ఏకంగా 80 కోట్లకు అధిపతిని చేసింది. ఇంతకీ సంగతేంటంటే.. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి 1990లో లక్ష రూపాయలు పెట్టి జేఎస్‌డబ్ల్యూలో షేర్లు కొన్నాడు. 30 ఏళ్లు గడిచిపోయాయి. ఆ షేర్లు ఇంకా అలానే ఉన్నాయి.


తాజాగా, అతని కుమారుడు ఆ షేర్లను చూశాడు. వాటి ప్రస్తుత విలువ తెలిసి షాక్ అయ్యాడు. అప్పుడు లక్ష రూపాయలతో కొన్న షేర్ల విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం.. దాదాపు రూ.80 కోట్లుగా ఉంది. తండ్రి ఎప్పుడో చేసిన మంచి పని కారణంగా.. 30 ఏళ్ల తర్వాత కుమారుడి జీవితం మారిపోయింది. అతడ్ని రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసింది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు. అతడి అదృష్టానికి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


‘ఇప్పుడు ఆ వ్యక్తి రిటైర్‌మెంట్ తీసుకోవచ్చు. జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా జీవించొచ్చు. ఆ డబ్బులతో ఓ బిజినెస్ కూడా చేయవచ్చు. అతడికి శుభాకాంక్షలు..' ‘నీలాంటి అదృష్టవంతులు అత్యంత అరుదుగా ఉంటారు బ్రో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఇండియాలో స్టీల్ ఉత్పత్తి చేస్తున్న ప్రధాన కంపెనీల్లో ఒకటి. మార్కెట్‌లో మంచి పేరుంది. కంపెనీ విలువ దాదాపు 2.37 ట్రిలియన్లు. ఇక, ఈ కంపెనీ షేర్ల రేటు దాదాపు వెయ్యి రూపాయల దగ్గర ఉంది.


ఇవి కూడా చదవండి

తలనొప్పి తగ్గేదెలా

ఉపాధికి వారధిగా

Updated Date - Jun 09 , 2025 | 03:11 PM