Share News

తలనొప్పి తగ్గేదెలా

ABN , Publish Date - Jun 09 , 2025 | 06:24 AM

ఒత్తిడి, ఆందోళన, అనవసరమైన ఆలోచనలు, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల తలనొప్పి రావడం సర్వ సాధారణం. తలనొప్పి అనిపించగానే మందుబిళ్ల మింగకుండా కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం...

తలనొప్పి తగ్గేదెలా

ఒత్తిడి, ఆందోళన, అనవసరమైన ఆలోచనలు, వాతావరణ కాలుష్యం లాంటి కారణాల వల్ల తలనొప్పి రావడం సర్వ సాధారణం. తలనొప్పి అనిపించగానే మందుబిళ్ల మింగకుండా కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఒక్కోసారి తీవ్రమైన భావోద్వేగాలు తలనొప్పికి కారణమవుతుంటాయి. అలాంటప్పుడు ధారాళంగా గాలి వీచే ప్రదేశంలో కూర్చుని కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస నిలపాలి. ఇలా పావుగంటసేపు చేస్తే ప్రయోజనం కనిపిస్తుంది.

  • కొంతమంది పని ధ్యాసలో పడి మంచి నీళ్లు తాగడం మార్చిపోతుంటారు. దీనివల్ల శరీరంలో నీటిశాతం తగ్గి నిర్జలీకరణ తలెత్తుతుంది. ఫలితంగా కళ్లు తిరగడం, తలనొప్పి ప్రారంభమవుతాయి. వెంటనే ఒక గ్లాసు చల్లటి మంచినీరు తాగితే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. దాహం అనిపించ పోయినా గంటకు ఒకసారి నీరు తాగడం మంచిది.

  • పలుచని చేతి రుమాలులో కొన్ని ఐస్‌ ముక్కలు చుట్టి తల మీద, నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి చాలావరకు తగ్గుతుంది. వేసవికాలంలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అదే చలికాలమైతే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే ఫలితం కనిపిస్తుంది.

  • మాడు మీద, కణతల మీద చేతి వేళ్లతో గుండ్రంగా రుద్దుతూ మెల్లగా మర్దన చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. మంచి నిద్ర కూడా వస్తుంది!

  • చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని కొద్దికొద్దిగా నములుతూ రసం మింగుతుంటే క్రమంగా తలనొప్పి మాయమవుతుంది.


  • మెదడు, కళ్లు, శరీరం అలసిపోయినా కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యాయామం, అల్పాహారం, భోజనం, నిద్ర సమయానుసారం ఉండేలా చూసుకోవాలి.

  • కంటిచూపునకు సంబంధించిన సమస్యలు ఉన్నా తలనొప్పి వస్తుంది. కాబట్టి ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలి.


ఇవీ చదవండి:

దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 06:24 AM