Crocodile Video: మొసలితో పెట్టుకునే ముందు ఆలోచించాల్సిందే.. వీడియో కోసం స్టంట్ చేయాలనుకుంటే..
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:09 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది గంటలు కొద్దీ సమయం దాని కోసమే వెచ్చిస్తున్నారు. అలాంటి వారిని ఆకట్టుకుని వైరల్ అయ్యేందుకు మరికొందరు విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలకు ఒడిగడుతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది గంటలు కొద్దీ సమయం దాని కోసమే వెచ్చిస్తున్నారు. అలాంటి వారిని ఆకట్టుకుని వైరల్ అయ్యేందుకు మరికొందరు విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలకు ఒడిగడుతున్నారు. ఆ క్రమంలో భారీ ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. తాజాగా ఓ వీడియోలో వ్యక్తి మొసలి (Crocodile)తో స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ మొసలి తనదైన స్టైల్లో ఎదురుతిరగడంతో అక్కణ్నుంచి పారిపోయాడు (Stunt with Crocodile).
therealtarzann అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కాలువలో ఓ భారీ మొసలి ఉంది. దాని తోక పట్టుకుని వీడియో తీసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అత్యంత భారీగా ఉన్న దాని తోకను పైకి తేల్చగలిగాడు. ఆ సమయంలో ఆ భారీ మొసలి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ వ్యక్తి అక్కణ్నుంచి పారిపోయాడు. ఆ ఘటనను రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను 60 లక్షల మందికరి పైగా వీక్షించారు. దాదాపు 2.5 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. మొసలితో అలా చేయాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. మూర్ఖత్వం అని ఒకరు కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో పడిన కొందరకి తమ జీవితం విలువ తెలియడం లేదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క రోజూ పని చేయకపోయినా రూ.26 లక్షల జీతం.. అబుధాబి కంపెనీకి కోర్టులో షాక్..
వేదిక పైనే వరుడిని ముద్దులతో ముంచెత్తిన వధువు.. పురోహితుడి రియాక్షన్ చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 22 , 2025 | 11:09 AM