Salary: ఒక్క రోజూ పని చేయకపోయినా రూ.26 లక్షల జీతం.. అబుధాబి కంపెనీకి కోర్టులో షాక్..
ABN , Publish Date - Jun 22 , 2025 | 08:27 AM
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఆ వ్యక్తి ఒక్కరోజు కూడా ఉద్యోగానికి వెళ్లలేదు. అయినా సరే రూ.26 లక్షల రూపాయలు జీతంగా పొందాడు. కోర్టులో కేసు ఓడిపోవడంతో ఆ సంస్థ ఆ డబ్బులు చెల్లించకతప్పలేదు. యూఏఈకి చెందిన ఆ వ్యక్తికి 2024లో అబుధాబికి చెందిన ఓ సంస్థలో ఉద్యోగం వచ్చింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన ఆ వ్యక్తి ఒక్కరోజు కూడా ఉద్యోగానికి (Job) వెళ్లలేదు. అయినా సరే రూ.26 లక్షల రూపాయలు జీతంగా పొందాడు. కోర్టులో కేసు ఓడిపోవడంతో ఆ సంస్థ ఆ డబ్బులు చెల్లించకతప్పలేదు. యూఏఈకి చెందిన ఆ వ్యక్తికి 2024లో అబుధాబికి (Abudhabi) చెందిన ఓ సంస్థలో ఉద్యోగం వచ్చింది. 2024 నవంబర్ నుంచి ఐదు నెలల పాటు అతడి చేత పని చేయించుకుని నెలకు రూ.1.69 లక్షల చొప్పున జీతం చెల్లించేందుకు ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ అభ్యర్థికి, ఆ సంస్థకు మధ్య ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్టు జరిగింది. అయితే అగ్రిమెంట్ సమయం మొదలైన తర్వాత కూడా ఆ సంస్థ నుంచి ఆ అభ్యర్థికి ఎలాంటి కబురూ రాలేదు. దీంతో ఆ అభ్యర్థే సదరు సంస్థను సంప్రదించినా ఎలాంటి స్పందనా లేదు. చివరకు ఆ అగ్రిమెంట్ సమయం కూడా ముగిసిపోయింది. దీంతో సదరు అభ్యర్థి ఆ సంస్థపై కోర్టులో కేసు వేశాడు. తాను పని చేయడానికి సిద్ధంగానే ఉన్నా, సదరు సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆ సంస్థతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం తాను వేరే ఏ పనికీ వెళ్లకుండా ఖాళీగా ఉండిపోయానని పేర్కొన్నాడు.
కోర్టు ఆదేశాలకు స్పందించిన సంస్థ ఆ అభ్యర్థి ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాలేదని, అందువల్లనే జీతం చెల్లించలేదని పేర్కొంది. అయితే ఆ కంపెనీ తన వాదనలకు బలం చేకూర్చే డాక్యుమెంట్లను కోర్టులో ప్రవేశపెట్టలేకపోయింది. సదరు సంస్థ ఉద్దేశపూర్వకంగా అభ్యర్థికి నష్టం కలిగించేలా ప్రవర్తించిందని నమ్మిన న్యాయస్థానం సదరు అభ్యర్థికి నష్టపరిహారంగా రూ.26 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
మీ దృష్టికి పరీక్ష.. ఈ మంచులో ఎలుగుబంటి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
వేదిక పైనే వరుడిని ముద్దులతో ముంచెత్తిన వధువు.. పురోహితుడి రియాక్షన్ చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..