Bride and Groom: వేదిక పైనే వరుడిని ముద్దులతో ముంచెత్తిన వధువు.. పురోహితుడి రియాక్షన్ చూస్తే..
ABN , Publish Date - Jun 21 , 2025 | 08:04 AM
సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లికి (Wedding) సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సందర్భాలకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) అందర్నీ అలరిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
lovely_moni అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహ వేదికపై బంధు మిత్రుల సమక్షంలో వధూవరులు నిలబడి ఉన్నారు. మొదట వరుడు (Groom) కరెన్సీ నోట్లతో వధువకు దిష్టి తీశాడు. అనంతరం వధువు (Bride) కూడా అలాగే వరుడికి దిష్టి తీసింది. ఆ తర్వాత వరుడిని వధువు కౌగిలించుకుని అందరి ముందు ముద్దుల వర్షం కురిపించింది. దీంతో వేదికపై నిలబడి ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూస్తూ కేకలు వేయడం ప్రారంభించారు. ఆ ముద్దులు చూసి పురోహితుడు ఆశ్చర్యపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు ఐదు లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 34 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఇది ప్రేమ వివాహం అయి ఉండవచ్చని ఒకరు కామెంట్ చేశారు. గ్రామంలో వివాహ వేదికపై అందరి ముందు వరుడిని ఇలా ముద్దు పెట్టుకోవడానికి ధైర్యం కావాలని మరో యూజర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ దృష్టికి పరీక్ష.. ఈ మంచులో ఎలుగుబంటి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
చావుతో చెలగాటం.. కదులుతున్న ట్రైన్ కింద నుంచి ఎలా వచ్చాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..