ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

4 Minute Heist: మంచం పక్కన మృత్యువు.. నిద్రలేచి ఉంటే చచ్చే వాడు..

ABN, Publish Date - Aug 14 , 2025 | 07:38 AM

4 Minute Heist: దొంగతనం జరుగుతున్న సమయంలో రితిక్ నిద్రలేచి ఉంటే.. దొంగ రాడ్డుతో అతడి తల పగలగొట్టేవాడు. రితిక్ ప్రాణాలు పోయేవి. దేవుడే అతడ్ని కాపాడాడని చెప్పొచ్చు.

4 Minute Heist

ఓ వ్యక్తి మంచంలో గురకపెట్టి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రలేస్తే ప్రాణాలు తీయడానికి మంచం పక్కన మృత్యువు కాచుకుని ఉంది. అయితే, అతడి అదృష్టం బాగుండి నిద్రలోంచి మెలుకువ రాలేదు. ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ ఏంటా సంగతి? మృత్యువు ఏంటి? అని తెలుసుకోవాలనుకుంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఉత్తర ప్రదేశ్, ఇండోర్‌లోని విజయ్ నగర్‌లో ఉన్న రిటైర్డ్ జస్టిస్ రమేశ్ గర్గ్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు పడ్డారు.

3.30 గంటల ప్రాంతంలో ఓ ఇద్దరు రమేశ్ కొడుకు రితిక్ గదిలోకి వెళ్లారు. మరో దొంగ బయట కాపలాగా ఉన్నాడు. ఆ గదిలో రితిక్ మంచంలో గాఢ నిద్రలో ఉన్నాడు. బోర్లా గురకపెట్టి నిద్రపోతున్నాడు. దొంగల ఇద్దరి చేతుల్లో ఇనుప రాడ్లు ఉన్నాయి. ఓ దొంగ మంచం దగ్గర నిల్చనున్నాడు. రితిక్ నిద్రలేస్తే ఇనుపరాడ్డుతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో దొంగ అల్మారాలోని డబ్బు, నగల్ని దోచేస్తున్నాడు. 4 నిమిషాల్లో దొంగలు తమ పని ముగించేశారు. అక్కడినుంచి వెళ్లిపోయారు.

దొంగతనం జరుగుతున్న సమయంలో రితిక్ నిద్రలేచి ఉంటే.. దొంగ రాడ్డుతో అతడి తల పగలగొట్టేవాడు. రితిక్ ప్రాణాలు పోయేవి. దేవుడే అతడ్ని కాపాడాడని చెప్పొచ్చు. ఇక, దొంగలు ఇంటినుంచి 5 లక్షల నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంటి బయట కాపలాగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అయినా దొంగలు ఎంతో చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. చప్పుడు కాకుండా దొంగతనం చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం..

ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలి

Updated Date - Aug 14 , 2025 | 07:39 AM