Share News

Earthquake In Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం..

ABN , Publish Date - Aug 14 , 2025 | 06:28 AM

Earthquake In Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్‌, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి.

Earthquake In Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం..
Earthquake In Vikarabad

వికారాబాద్‌ జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్‌, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. గత మే నెలలో నిర్మల్‌, నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.


భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఆసిఫాబాద్‌ వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం వచ్చిన కాసేపటికే ఈదురు గాలులు వీయడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు.


మరో రెండు రోజులు భారీ వర్షాలు..

మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇంకో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలి

ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలి

Updated Date - Aug 14 , 2025 | 07:02 AM