2 Women Marry: ఎంత మోసపోతే మాత్రం.. ఇలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా..
ABN, Publish Date - May 15 , 2025 | 07:06 AM
2 Women Marry: ఆ ఇద్దరు అమ్మాయిలది ఒకే అనుభవం కావటంతో మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మగాళ్ల అవసరం తమకు లేదని నమ్మి.. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు మనుషుల ఆలోచనల్నీ ఒకేలా ఉండవు. కానీ, అనుభవాలు మాత్రం ఒకేలా ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ప్రేమించటం.. మోస పోవటం తరతరాలుగా జరుగుతూనే ఉంది. ఇందుకు ఆడ, మగ అన్న తేడా లేదు. ప్రేమలో మోస పోయిన వాళ్లకు.. ప్రేమపై ఆసక్తి పోవటం సహజం. అయితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్‌లో ఓ వింత విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వాళ్ల చేతిలో మోసపోయామన్న కారణంతో ఓ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బదౌన్ కు చెందిన మీనా, సప్న అనే ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే ఆఫీసులో పని కావటంతో తొందరగానే ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి పర్సనల్ విషయాలు మరొకరితో పంచుకునే వారు. ఈ నేపథ్యంలోనే తమ లవ్ ఫెయిల్యూర్స్ గురించి కూడా చర్చించుకున్నారు. ఈ ఇద్దరూ గతంలో ఫేస్‌బుక్ ద్వారా ఓ ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమించారు. కొన్నేళ్ల పాటు లవ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరు మగాళ్లు వీరిని మోసం చేశారు. ఆ మోసాన్ని వీరు తట్టుకోలేకపోయారు.
ఇద్దరిదీ ఒకే అనుభవం కావటంతో మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసుకాబట్టి.. మగాళ్ల కారణంగా మళ్లీ మోస పోవటం ఇష్టం లేదు కాబట్టి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తాజాగా, ఓ గుడిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మీన మాట్లాడుతూ.. ‘ మగాళ్లను నమ్మడానికి వీళ్లేదు కాబట్టి.. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం’ అని అంది. మగాళ్లు లేకుండా తాము బతికి చూపిస్తామని ఇద్దరూ అంటున్నారు. మరి, వీరి జీవితం ఎలా సాగుతుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
Updated Date - May 15 , 2025 | 07:06 AM