ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Walking Health: నెల రోజుల పాటు.. రోజూ 30 నిముషాల పాటు నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..

ABN, Publish Date - Apr 18 , 2025 | 07:11 AM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. కనీసం వ్యాయామం కూడా చేయకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

1/6

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. కనీసం వ్యాయామం కూడా చేయకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. రోజూ కనీసం నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటూ రోజూ 30 నిముషాల పాటు నడవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..

2/6

రోజూ ఉదయాన్నే నడవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అలాగే నడక ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి తోడు ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి.

3/6

రోజూ అరగంట పాటు నడవడం వల్ల డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

4/6

రోజూ నడవడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నడక మెదడును ఉత్తేజపరచడమే కాకుండా ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తుంది.

5/6

రోజూ నడవడం దినచర్యగా చేసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఊబకాయ సమస్య కూడా రాకుండా ఉంటుంది.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Apr 18 , 2025 | 07:11 AM