ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kidneys Health Tips: కిడ్నీలకు హాని కలిగించే 6 అలవాట్లు ఇవే..

ABN, Publish Date - May 05 , 2025 | 01:39 PM

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. రక్తాన్ని శుభ్రపరచడంతో పాటూ శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే..

1/7

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. రక్తాన్ని శుభ్రపరచడంతో పాటూ శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

ఆహారంలో ఉప్పు అవసరమైనా.. ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. తద్వారా మూత్రపిండాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీల్లోని చిన్న రక్త నాళాలను దెబ్బతీసి, రక్తాన్ని సరిగ్గా శుభ్రం చేయకుండా నిరోధిస్తుంది.

3/7

రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. నీరు సరిగా తాగకపోతే వ్యర్థాలు పేరుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

4/7

నొప్పులకు సంబంధించిన మందులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని తగ్గించడంతో పాటూ కాలక్రమేణా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

5/7

చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తదితర ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలుగుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది.

6/7

మీ శరీరానికి ప్రోటీన్ అవసరమే అయినా.. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మాంసం ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయి.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 05 , 2025 | 01:39 PM