Beauty Tips: ముఖానికి కలబంద రాసుకుంటున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..
ABN, Publish Date - Jun 19 , 2025 | 08:05 PM
కలబంద చర్మానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. కలబందలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటూ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. అయితే..
కలబంద చర్మానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. కలబందలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటూ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. అయితే దీన్ని వినియోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది కలబందను ముఖానికి రాసుకుని గంటల తరబడి అలాగే ఉంచుతుంటారు. ఇలా చేస్తే చర్మం పొడిబారుతుంది. రాత్రంతా చర్మంపై అప్లై చేసి ఉంచడం సరైన పద్ధతి కాదు. దీనికి బదులుగా 10నుంచి 15 నిముషాలు అప్లై చేసి కడుక్కుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
చాలా మంది ప్యాచ్ టెస్ట్ చేయకుండానే కలబందను ముఖంపై రాసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కలబందను ఉపయోగించే ముందు.. దాన్ని చేయి, లేదా చెవి వెనుక భాగంలో పూయాలి. ఎలాంటి ఇబ్బందీ లేదనుకున్న తర్వాతే ముఖంపై అప్లై చేయాలి.
ముఖంపై కలబందను అప్లై చేసిన తర్వాత ఎండలో బయటకు వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల చర్మంపై పిగ్మెంటేషన్ పెరగడంతో పాటూ చికాకు పుడుతుంది.
కొందరు రోజూ చర్మానికి కలబందను అప్లై చేస్తుంటారు. ఒక్కొక్కరి చర్మం ఒక్కోలా ఉండడం వల్ల కొందరిలో చర్మం పొడిగా, గరుకుగా మారే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా చౌకైన లేదా కల్తీ కలబంద జెల్‌ను వాడడం వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది.
ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Jun 19 , 2025 | 08:05 PM