ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Summer Health Tips: వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తినండి చాలు..

ABN, Publish Date - May 11 , 2025 | 01:10 PM

వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వడదెబ్బ, అలసట, నిర్జలీకరణం, చర్మ సమస్యలతో పాటూ జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తుంటాయి.

1/6

వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. వడదెబ్బ, అలసట, నిర్జలీకరణం, చర్మ సమస్యలతో పాటూ జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2/6

వేసవిలో ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి.. వృద్ధులు, పిల్లల్లో రోగ నిరోధక శక్తిని మరింత పెంచుతుంది.

3/6

వేసవిలో వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి వేసవి జ్వరం నుండి రక్షించడంలో సాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, బి6, మాంగనీస్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

4/6

బాదం పప్పులు తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి.. ఉదయం పాలు, పండ్ల రసం లేదా తేనెతో కలిపి తినాలి. వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంలో బాదం పప్పులు సాయం చేస్తాయి.

5/6

వేసవి తాపాన్ని తగ్గించడంలో పసుపు కూడా బాగా పని చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. క్యాన్సర్, మధుమేహం, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 11 , 2025 | 01:10 PM