ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: ఈ అందమైన పూల వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసా..

ABN, Publish Date - Sep 26 , 2025 | 09:49 AM

అందమైన పూలను చూసినప్పుడు. ఒక్కసారిగా మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. అయితే కొన్ని పూలు చూసేందుకు అందంగా కనిపించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.

1/7

అందమైన పూలను చూసినప్పుడు. ఒక్కసారిగా మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. అయితే కొన్ని పూలు చూసేందుకు అందంగా కనిపించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఆ పూలు ఏంటో, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2/7

చూడటానికి ఎంతో అందంగా కనిపించే చమోమిలే పూలు.. అంతే స్థాయిలో ఆరోగ్యం కూడా అందిస్తాయి. ఈ పూల నుంచి చేసిన టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతో పాటూ జీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ ఈ పూలు బాగా పని చేస్తాయి.

3/7

అరటి పూలు చూసేందుకు ఎంత అందంగా ఉంటాయో.. వాటి వల్ల అంతే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఇనుము శరీరానికి మేలు చేస్తుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ సాయం చేస్తుంది. మహిళల్లో ఋతు చక్రం సమతుల్యం చేయడంలో బాగా పని చేస్తుంది.

4/7

మందార పూలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ పూలు.. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సాయం చేస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

5/7

లావెండర్ పూలు మంచి సువాసనతో పాటూ ఉపశమనం కలిగిస్తాయి. టీలు, డెజర్ట్‌లతో పాటూ వివిధ రకాల వంటల్లో ఈ పూలను వాడతారు. వీటి వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటూ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే మనసుకు ప్రశాంతతను అందిస్తాయి.

6/7

నాస్టూర్టియం పూలు అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తాయి. ఈ పూలల్లో అధికంగా ఉండే విటమిన్‌-సి.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే శ్వాసకోశ ఇన్షెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో పాటూ చర్మాన్ని మరింత కాంతివంతంగా మారుస్తాయి.

7/7

గులాబీ పూలు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ పూలతో ఆరోగ్యం కూడా అదే స్థాయిలో అందుతుంది. గులాబీ రేకులు ఒత్తిడిని తగ్గించడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆమ్లత్వం, వేడికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఈ పూలు బాగా పని చేస్తాయి.

Updated Date - Sep 26 , 2025 | 09:49 AM