Health Tips: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ABN, Publish Date - Sep 05 , 2025 | 09:59 PM
ప్రస్తుతం ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు ఒక వయసు దాటిని వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ప్రస్తుతం చిన్న యువకుల్లో కూడా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు ఒక వయసు దాటిని వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య.. ప్రస్తుతం చిన్న యువకుల్లో కూడా కనిపిస్తోంది. అయితే డయాబెటిస్ సోకే ముందు పాదాలలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమైతే.. డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
రాత్రి సమయంలో తరచూ అరికాళ్లలో మంటగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే పాదాలు చల్లగా మారుతున్నా కూడా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
పాదాల రంగులో మార్పు కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. పాదాలు పసుపు లేదా నీలం రంగులోకి మారుతుంటే.. అది డయాబెటిస్‌కు సంకేతం కావొచ్చు.
పాదాల చర్మం పొడిగా మారడంతో పాటూ పొరలుగా మారుతూ దురదగా అనిపిస్తుంటే వెంటనే అప్రమత్తమవ్వాలి.
గాయాలు మానడంలో ఆలస్యం, నొప్పి లేదా తిమ్మిరి, గోళ్లలో మార్పులు కూడా డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Sep 05 , 2025 | 09:59 PM