ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Interesting Facts: బల్లుల గురించి ఎవరికీ తెలియని రహస్యాలివే..

ABN, Publish Date - Jun 22 , 2025 | 08:13 PM

ప్రతి ఇంట్లో బల్లుల బెడద కామన్‌గా ఉంటుంది. కొందరు బల్లిని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. అవి మీద పడితే అప శకునం, శబ్ధం చేస్తే శుభ శకునంలా భావిస్తుంటారు. అయితే ..

1/8

ప్రతి ఇంట్లో బల్లుల బెడద కామన్‌గా ఉంటుంది. కొందరు బల్లిని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. అవి మీద పడితే అప శకునం, శబ్ధం చేస్తే శుభ శకునంలా భావిస్తుంటారు. అయితే ఎవరికీ బల్లుల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

కొన్ని బల్లులు తమ చర్మాన్ని తామే తింటాయి. అలాగే కొన్ని బల్లులు తమ చర్మాన్ని తామే వదిలించుకుని, తర్వాత దాన్ని తామే తింటాయి. ఇలా చేయడం వల్ల పోషకాలు రీసైకిల్ అవుతాయట.

3/8

పోషకాలు, ఖనిజాలను తిరిగి పొందేందుకు ఇలా చేసే బల్లులు.. తమ శత్రువులకు తమ జాడను తెలియకుండా ఉండేందుకు కూడా ఇలా చేస్తాయట.

4/8

బల్లులు క్లోకా అనే రంధ్రం ద్వారా మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తాయి. తమ శరీరంలో పేరుకుపోయిన ఘన, ద్రవ వ్యార్థాలను ఈ రంధ్రం ద్వారా బయటికి పంపిస్తుంటాయి. అలాగే పునరుత్పత్తి కోసం కూడా దీన్ని ఉపయోగిస్తుంటాయి.

5/8

బల్లి తోక శరీరం నుంచి వేరు చేయబడిన తర్వాత కూడా చాలా నిముషాల వరకూ నేలపై ఎగురుతూ ఉంటుంది. ఇది శత్రువుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

6/8

బల్లులు కొన్నిసార్లు తమ పిల్లలను తామే తింటాయి. అన్ని బల్లులూ ఇలా చేయకపోయినా.. ఇగువానాలు, మానిటర్ బల్లులు తదితర జాతులు.. ఆహారం దొరకని సమయంలో తమ పిల్లలను తామే తింటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు చనిపోయిన పిల్లలను కూడా తింటుంటాయి.

7/8

బల్లులు వేటాడడమే కాకుండా తమ పరిసరాల్లో దుర్వాసనను గుర్తించడానికి తమ నాలుకను లోపలికి, బయటికి ఎగురవేస్తుంటాయి. అలాగే గాలి నుంచి దుర్వాసన కణాలను సేకరించి, వాటిని నోటి పైభాగంలో ఉన్న జాకబ్సన్స్ ఆర్గాన్ అనే ప్రత్యేక అవయవానికి బదిలీ చేస్తాయి.

8/8

ఈ అవయవం సేకరించిన వాసనను విశ్లేషిస్తుంది. ఇది బల్లుల ఆహారాన్ని కనుగొనడం, సహచరులను కనుగొనడంలో సాయపడుతుంది.

Updated Date - Jun 22 , 2025 | 08:13 PM