ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: టీ వల్ల మీకు తెలీకుండా జరిగే 4 నష్టాలివే..

ABN, Publish Date - Sep 25 , 2025 | 08:37 AM

ఉదయం లేవగానే ముందుగా గుర్తుకువచ్చేంది టీ, కాఫీ. ఇదీ లేకుండా తెల్లవారదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎప్పుడు పడితే అప్పుడు టీలు, కాఫీలు తాగుతుంటారు. అయితే..

1/7

ఉదయం లేవగానే ముందుగా గుర్తుకువచ్చేంది టీ, కాఫీ. ఇదీ లేకుండా తెల్లవారదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరైతే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎప్పుడు పడితే అప్పుడు టీలు, కాఫీలు తాగుతుంటారు. అయితే ఈ అలవాటు వల్ల మనకు తెలీకుండానే మన శరీరంలో 4 నష్టాలు సంభవిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

టీని అమితంగా తాగడం వల్ల అనేక నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లం పెరిగి చికాకు కలిగిస్తుంది. ఎందుకంటే ఉదయం కడుపు పొర సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో టీ తాగడం వల్ల అసౌకర్యానికి దారి తీస్తుంది.

3/7

టీ అధికంగా తాగడం వల్ల శరీరంలో ఇనుమును గ్రహించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. టీలో ఉండే టానిన్లు.. ఆహారం నుంచి ఇనుము శోషణను నిరోధిస్తాయి. దీంతో కాలక్రమేణా ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రధానంగా అలసట, జుట్టు రాలడం, థైరాయిడ్ తదితర సమస్యలు తలెత్తుతాయి.

4/7

టీ అలవాటు వల్ల శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. టీలోని కెఫిన్ కాల్షియం నష్టాన్ని పెంచుతుంది. దీంతో ఎముకల బలహీనత, కీళ్లనొప్పులు తలెత్తుతాయి.

5/7

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే జీర్ణక్రియ, పోషకాల శోషణపై ప్రభావం చూపిస్తుంది.

6/7

ఉదయం లేవగానే నీరు తాగడం, పండ్లు తినడం ద్వారా రోజును ప్రారంభించండి. భోజనానికి 30 నిముషాల ముందు లేదా తర్వాత తాగాలి.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Sep 25 , 2025 | 08:37 AM