Health Tips: ఆందోళన నుంచి బయటపడడానికి ఈ 6 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు..
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:12 PM
ప్రస్తుతం చాలా మంది అనేక మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు ఆందోళన నుంచి బయటపడలేక సతమతమవుతుంటారు.
ప్రస్తుతం చాలా మంది అనేక మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరు ఆందోళన నుంచి బయటపడలేక సతమతమవుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఊరగాయలు, క్యాబేజీని ఉప్పుతో పులియబెట్టి చేసే సౌర్‌క్రాట్, పాలతో చేసే కేఫీర్ వంటి పదార్థాలలో ప్రోబయోటిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక సమస్యలకు బాగా పనిచ చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.
జింక్ అధికంగా ఉండే జీడిపప్పు, గుడ్డు సొన వంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
మీ ఆహారంలో అవకాడో, బాదం వంటి విటమిన్ బి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య తగ్గుతుంది.
సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆందోళనను తగ్గించడంలో బాగా పని చేస్తాయి.
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటూ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Jul 12 , 2025 | 04:12 PM