ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hiccups Prevention Tips: మీరు ఎక్కిళ్లతో బాధపడుతున్నారా..అయితే ఈ 5 చిట్కాలు ట్రై చేసి చూడండి

ABN, Publish Date - Sep 24 , 2025 | 11:55 AM

ఎక్కిళ్లు రావడం ఎవరికైనా సహజమే. అయితే కొందరి విషయంలో ఇది కొన్నిసార్లు సమస్యగా మారుతుంటుంది. పదే పదే ఎక్కిళ్లు రావడం వల్ల ఇబ్బంది పడుతుంటారు.

1/7

ఎక్కిళ్లు రావడం ఎవరికైనా సహజమే. అయితే కొందరి విషయంలో ఇది కొన్నిసార్లు సమస్యగా మారుతుంటుంది. పదే పదే ఎక్కిళ్లు రావడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యకు మీ ఇంట్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఈ 5 చిట్కాలను ప్రయోగించి చూస్తే రిలీఫ్ దొరుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

ఎక్కిళ్లను వెంటనే ఆపడానికి చక్కెర తీసుకోవడం చాలా సులభమైన మార్గం. నోటిలో ఒక చెంచా చక్కెర వేసుకుని నెమ్మదిగా మింగడం వల్ల ఎక్కిళ్లు ఆగుతాయి. చక్కెర తీపి రుచి నాడీ వ్యవస్థపై పని చేస్తుంది. కండరాల సంకోచాన్ని నియంత్రించే వేగస్ నాడిపై ఇది ప్రభావం చూపుతుంది. తద్వారా ఎక్కిళ్లు ఆగిపోయేందుకు అవకాశం ఉంటుంది.

3/7

ఎక్కిళ్లను తగ్గించడంలో తేనె కూడా బాగా పని చేస్తుంది. కొన్నిసార్లు చెక్కర కంటే తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది.

4/7

పెరుగు కూడా ఎక్కిళ్లను తగ్గించడంలో సాయం చేస్తుంది. ఒక కప్పు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.

5/7

చక్కెర, నిమ్మకాయ కలయిక ఎక్కిళ్లను తగ్గిస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ , చక్కెర కలిసి ఎక్కిళ్లను తగ్గించడంలో సాయం చేస్తాయి. నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొద్దిగా చక్కెర వేసి నోట్లో పెట్టుకోవాలి. దాని రసం మిగడం ద్వారా కొన్ని నిముషాల్లోనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.

6/7

పసుపు, పాల మిశ్రమం కూడా ఎక్కిళ్లను తగ్గించడంలో బాగా పని చేస్తుంది. గ్లాసు గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి తాగడం వల్ల ఎక్కిళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Sep 24 , 2025 | 11:55 AM