ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kitchen Hacks: పొరపాటున కూడా ఈ 5 వస్తువులను ఫ్రిడ్జ్‌‌ డోర్‌లో పెట్టొద్దు..

ABN, Publish Date - Aug 27 , 2025 | 07:26 AM

చాలా మంది వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

1/7

చాలా మంది వంటింట్లోని ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

చాలా మంది పాలను రిఫ్రిజిరేటర్ తలుపు ప్రాంతంలో ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల పాలలోని ఉష్ణోగ్రత దెబ్బతిని త్వరగా పాడవుతాయి. కాబట్టి పాలను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లోపలి భాగంలో పెట్టాలి.

3/7

గుడ్లను కూడా ఎక్కువ మంది ఫ్రిడ్జ్‌ డోర్‌లో పెడుతుంటారు. తలుపు వద్ద ఉష్ణోగ్రత తరచూ మారడం వల్ల గుడ్లలో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి వీటిని కూడా కార్టన్‌లో ఉంచి లోపలి భాగంలో పెట్టాలి.

4/7

పచ్చి మాంసం, చికెన్ వంటి ఆహారాలు ఫ్రిడ్జ్ డోరు వద్ద ఉంచకండి. వీటి నుంచి విడుదలయ్యే రసాలు ఇతర ఆహారాలను పాడుచేస్తాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ ఫ్రిడ్జ్ కింద భాగంలో ఉన్న షెల్ప్‌లో పెట్టాలి.

5/7

పండ్లు, కూరగాయలను కూడా ఫ్రిడ్జ్ డోర్ వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే అవి త్వరగా పాడవుతాయి. వీటి కోస ఫ్రిడ్జ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలంలోనే ఉంచాలి.

6/7

పనీర్, జున్నును కూడా డోర్ వద్ద పెట్టకూడదు. ఇలా చేస్తే అవి కూడా త్వరగా పాడవుతాయి. కాబట్టి వీటిని కూడా లోపలి భాగంలో ఉంచాలి.

7/7

తలుపు డోరు వద్ద త్వరగా చెడిపోని సాస్, జ్యూస్, నీరు తదితరాలను మాత్రమే ఉంచాలి. ఇవి త్వరగా చెడిపోవు కాబట్టి.. ఫ్రిడ్జ్ డోరు వద్ద ఉంచినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

Updated Date - Aug 27 , 2025 | 07:26 AM