ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

watermelon: పుచ్చకాయ గింజలను.. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - May 09 , 2025 | 07:23 AM

వేసవిలో ఎంతో మంది ఇష్టంగా తినే వాటిలో పుచ్చకాయ ఒకటి. అయితే దీన్ని తినే వారు అందులోని విత్తనాలను పారేసి తింటుంటారు. అయితే..

1/8

వేసవిలో ఎంతో మంది ఇష్టంగా తినే వాటిలో పుచ్చకాయ ఒకటి. అయితే దీన్ని తినే వారు అందులోని విత్తనాలను పారేసి తింటుంటారు. అయితే పుచ్చకాయ గింజలను తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

పుచ్చకాయ విత్తనాలను నీటితో శుభ్రం చేసి.. తర్వాత వాటిపై కొంచెం ఆలివ్ నూనె, ఉప్పు చల్లుకోవాలి. ఆ తర్వాత వాటిని బేకింగ్ పేపర్ మీద వేసి ఓవెన్‌లో ఉంచాలి. ఓవెన్ ఉష్ణోగ్రత 325 డిగ్రీల ఫారెన్‌‌హీట్ ఉండేలా సెట్ చేసుకోవాలి. 7 నిముషాల తర్వాత వాటిని బయటికి తీసి మరో ఏడు నిముషాలు కాల్చాలి. ఇలా చేసిన తర్వాత వాటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3/8

పుచ్చకాయ గింజల్లో అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. శరీరంలో బలహీనత, ఖనిజాల లోపం వంటి సమస్యలకు మందులు తీసుకోవడం కంటే పుచ్చకాయ గింజలను తీసుకోవడం ఉత్తమం. ఈ విత్తనాల్లో ఉండే ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది.

4/8

శరీరంలో ఇనుము స్థాయి తక్కువగా ఉండే వారు పుచ్చకాయ గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజల్లో అధిక మొత్తంలో ఉండే ఇనుము.. రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది.

5/8

పుచ్చకాయ గింజలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటూ ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది.

6/8

పుచ్చకాయ గింజల్లోని జింక్.. ఎముకల బలోపేతానికి సాయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియ, నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

7/8

ఈ గింజల్లోని మెగ్నీషియం.. జీవక్రియ, హార్మోన్లు, గుండె ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు అనుకూలంగా ఉంటుంది.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 09 , 2025 | 07:23 AM