ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: మొలకెత్తిన కొబ్బరి తినడం వల్ల ఏమవుతుందో తెలుసా..

ABN, Publish Date - Aug 15 , 2025 | 09:15 PM

కొబ్బరికాయను పగులగొట్టినప్పుడు.. లోపల పువ్వు కనిపిస్తే అదృష్టం అని భావిస్తారు. అలాగే ఈ పువ్వును కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే..

1/8

కొబ్బరికాయను పగులగొట్టినప్పుడు.. లోపల పువ్వు కనిపిస్తే అదృష్టం అని భావిస్తారు. అలాగే ఈ పువ్వును కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఇలాంటి మొలకెత్తిన కొబ్బరిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

మొలకెత్తిన కొబ్బరిలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం తదిర ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు దోహదపడడంతో పాటూ బరువు నిర్వహణలో కూడా సహకరిస్తాయి.

3/8

మొలకెత్తిన కొబ్బరిలో ఉండే ఫైబర్, కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటూ గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

4/8

మొలకెత్తిన కొబ్బరిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.

5/8

థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉన్నవారికి మొలకెత్తిన కొబ్బరి బాగా పని చేస్తుంది. అలాగే రక్తంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిని అదుపులో ఉంచడం ద్వారా బలహీనతను తగ్గిస్తుంది.

6/8

మొలకెత్తిన కొబ్బరిని తరచూ తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదరకరమైన వ్యాధులు సోకకుండా అడ్డుకుంటుంది.

7/8

మొలకెత్తిన కొబ్బరి సులభంగా జీర్ణం అవుతుంది. దీనివల్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Aug 15 , 2025 | 09:17 PM