Papaya Seeds: బొప్పాయి తింటూ గింజలు పక్కన పడేస్తున్నారా.. వాటి లాభాలు తెలిస్తే..
ABN, Publish Date - Apr 09 , 2025 | 06:52 AM
చాలా మంది బొప్పాయి తినే సమయంలో గింజలను పక్కకు తీసేస్తుంటారు. అయితే వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి కాలేయ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయి. అలాగే ఈ గింజల్లోని సమ్మేళనాలు దెబ్బతిన్న కాలేయ కణజాలాన్ని కూడా బాగు చేస్తాయి.
బొప్పాయి గింజల్లోని ఎంజైమ్, పపైన్ వంటి పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఈ గింజలు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ఈ గింజల్లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. నోటి దుర్వాసన, చిగుళ్ల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మూత్ర పిండాలు, మూత్ర నాళాల నుంచి విషాన్ని బయటికి పంపడంలో బొప్పాయి గింజలు బాగా పని చేస్తాయి.
బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Apr 09 , 2025 | 06:52 AM