Summer Health Tips: వేసవిలో ఈ పండును రోజూ ఒకటి తినడం వల్ల ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - May 02 , 2025 | 02:58 PM
వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి చాలా రకాల హెల్త్ టిప్స్‌ను పాటిస్తుంటారు.
వేసవిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి చాలా రకాల హెల్త్ టిప్స్‌ను పాటిస్తుంటారు. అయితే వేసవిలో రోజూ ఒక కివీ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో చాలా మంది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే కివీ పండు తినడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కివీ పండులోని విటమిన్-సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు.. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.
కివీ పండులోని అనేక పోషకాలు అలసట, బలహీనత, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
కివీ పండులోని విటమిన్-సి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తుంది. అదేవిధంగా ఇందులోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. అలాగే కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు విషాన్ని బయటికి పంపడంలోనూ సాయం చేస్తాయి.
రోజూ ఒక కివీ పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అలాగే బరువు తగ్గేందుకూ సహాయపడుతుంది. మరోవైపు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగపడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి.
Updated Date - May 02 , 2025 | 02:58 PM