ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: తేనె, అల్లం కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

ABN, Publish Date - Jun 06 , 2025 | 06:25 AM

మన వంట గదిలో నిత్యం ఉపయోగించే వస్తువుల్లో అల్లం ఒకటి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తేనె వల్ల కూడా చాలా లాభాలున్నాయి.

1/7

మన వంట గదిలో నిత్యం ఉపయోగించే వస్తువుల్లో అల్లం ఒకటి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తేనె వల్ల కూడా చాలా లాభాలున్నాయి.అయితే రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

ఒక కప్పు నీటిలో చిన్న ముక్కలుగా తరిగిన అల్లంను మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లార్చిన తర్వాత అందులో టీస్పూన్ తేనె కలిపి తాగాలి.

3/7

అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం గొంతులో వాపును తగ్గిస్తుంది.

4/7

అల్లంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి.

5/7

తేనె, అల్లంలో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే వాంతులు, వికారం, అలెర్జీలు, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడంలో దోహదం చేస్తాయి.

6/7

అల్లం, తేనె గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంతో పాటూ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ అల్లం బాగా పని చేస్తుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jun 06 , 2025 | 06:25 AM