ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sleeping Habits: లైట్లు వేసుకుని నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే..

ABN, Publish Date - Apr 16 , 2025 | 07:29 AM

నిద్రపోయే సమయంలో ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. కొందరు లైట్లు ఆర్పి పడుకుంటే.. మరికొందరు లైట్ల వెలుతురులోనే నిద్రిస్తుంటారు.

1/7

నిద్రపోయే సమయంలో ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. కొందరు లైట్లు ఆర్పి పడుకుంటే.. మరికొందరు లైట్ల వెలుతురులోనే నిద్రిస్తుంటారు. అయితే లైట్ల వెలుతురులో నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

లైట్ల వెరుతురులో నిద్రపోవడం వల్ల శరీరంలోని జీవ గడియారం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

3/7

ప్రకాశవంతమైన కాంతిలో నిద్రపోవడం వల్ల మెదడు గందరగోళానికి గురై.. మంచి నిద్ర పట్టడంలో ఇబ్బంది కలుగుతుంది.

4/7

గదిలో లైట్లు వెలిగించడం వల్ల మీరు కళ్లు మూసుకున్నా కూడా మీ మెదడు అప్రమత్తంగా ఉంటుంది. దీనివల్ల విశ్రాంతి లభించడం కష్టతరమవుతుంది.

5/7

లైట్లు వెలిగించి నిద్రపోవడం వల్ల శరీరంలో నిద్రను నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నిద్రపోవడానికి ఇబ్బంది, నిద్ర సరిగా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

6/7

రాత్రిపూట లైట్ల వెలుతురులో పడుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

7/7

మీరు నిద్రపోయే ముందు గదిని చీకటిగా ఉంచుకోవాలి. ఒకవేళ లైట్ల వెలుతురులో నిద్రపోయే అలవాటు ఉన్న వారు.. తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 07:29 AM