ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: మద్యం మానేయడం వల్ల.. రోజు రోజుకూ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ABN, Publish Date - Aug 23 , 2025 | 07:04 AM

కొందరు మానేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక మళ్లీ అలవాటు చేసుకుంటుంటారు. మద్యం మానేయడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

1/7

మద్యానికి బానిసై చాలా మంది శారీరకంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంటారు. కొందరు మానేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక మళ్లీ అలవాటు చేసుకుంటుంటారు. మద్యం మానేయడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. మద్యం మానేయడం వల్ల రోజు రోజుకూ శరీరంలో ఏం జరుగుతందో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

మద్యం తాగడం మానేసిన 24 గంటల్లో శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. కాలేయం తనును తాను శుభ్రపరచుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. తద్వారా శరీరం నుంచి విషం బయటికి వెళ్లిపోతుంది.

3/7

మద్యం మానేయడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే ఉదయం మేల్కొనే సమయంలో మీ శరీరం ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది.

4/7

మద్యం మానేసిన నెల రోజుల్లో మీ చర్మంపై అనేక మార్పులు కనిపిస్తాయి. పొడిబారడం, ముడతల సమస్య తగ్గిపోయి కొత్త మెరుపు వస్తుంది. అదేవిధంగా ఉబ్బరాన్ని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

5/7

మద్యం మానేసిన 3 నుంచి 6 నెలల్లో బరువు నియంత్రణలోకి వస్తుంది. దీనికితోడు మీ కాలేయ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది.

6/7

మందు తాగడం మానేసిన ఏడాదికి గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది. కాలేయం పూర్తి ఆరోగ్యకరంగా మారుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

7/7

మద్యం మానేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిరాకు తగ్గిపోయి మనసుకు ప్రశాంత లభిస్తుంది. అదేవిధంగా నిరాశ, ఆందోళన కూడా తగ్గిపోతుంది.

Updated Date - Aug 23 , 2025 | 02:11 PM