ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: దానిమ్మ పండ్లు తిన్న తర్వాత.. తొక్కలు పడేస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే..

ABN, Publish Date - Sep 27 , 2025 | 08:15 AM

దానిమ్మ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. సాధారణంగా దానిమ్మ పండ్లు తిన్న తర్వాత చాలా మంది తొక్కలు పడేస్తుంటారు.

1/7

దానిమ్మ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. సాధారణంగా దానిమ్మ పండ్లు తిన్న తర్వాత చాలా మంది తొక్కలు పడేస్తుంటారు. అయితే దానిమ్మ తొక్కల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

దానిమ్మ తొక్కలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

3/7

దానిమ్మ తొక్కల టీ, పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే వీటి కషాయం తాగడం వల్ల కడుపులో పురుగులు తొలగిపోతాయి.

4/7

దానిమ్మ తొక్కల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా నోటి దుర్వాసన నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

5/7

దానిమ్మ తొక్కల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను తగ్గించడంతో పాటూ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.

6/7

దానిమ్మ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని డబ్బాలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకోవాలి.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Sep 27 , 2025 | 08:15 AM