ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Blood Pressure Problem: మీకు బీపీ సమస్య ఉందా.. అయితే ఈ 5 పదార్థాలకు దూరంగా ఉండడం బెటర్..

ABN, Publish Date - Apr 19 , 2025 | 07:04 AM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది హైబీపీ, లోబీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

1/7

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది హైబీపీ, లోబీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే బీపీ సమస్య ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా 5 ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2/7

ఊరగాయలు, చట్నీల్లో ఉప్పుతో పాటూ సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మార్కెట్లో లభించే ఊరగాయల్లో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది బీపీ సమస్య ఉన్న వారికి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.

3/7

బీపీ సమస్య ఉన్న వారు ఆల్కాహాల్‌కు దూరంగా ఉండడం బెటర్. రోజూ మద్యం తాగడం వల్ల గండె కండరాలు బలహీనపడడంతో పాటూ రక్తపోటు పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీపీ సమస్య ఉన్న వారు మద్యానికి దూరంగా ఉండడం ఉత్తమం.

4/7

రక్తపోటు సమస్య ఉన్న వారు ఉప్పునకు దూరంగా ఉండాలి. ఉప్పులోని సోడియం శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి బీపీ సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.

5/7

ప్యాక్ చేసిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాలకూ దూరంగా ఉండాలి. ఈ పదార్థాల్లో సోడియంతో పాటూ కొవ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి. పాస్తా సాస్, ప్యాక్ చేసిన ఆహారం, స్నాక్స్ తదితరాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

6/7

ఎర్ర మాంసంలోనూ అధిక మొత్తంలో కొవ్వులు ఉంటాయి. ఇవి రక్త నాళాలను సంకోచింపచేస్తాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. దీనికితోడు ఈ మాంసం జీర్ణమవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబ్బటి రక్తపోటు సమస్య ఉన్న వారు ఎర్ర మాంసానికి బదులుగా చేపలు, చికెన్ వంటి వాటిని తీసుకోవాలి.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Apr 19 , 2025 | 07:04 AM