ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: కాలేయ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. ఈ 6 తప్పులు అస్సలు చేయొద్దు..

ABN, Publish Date - Sep 11 , 2025 | 01:32 PM

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటూ అనేక విధులను నిర్వర్తిస్తుంటుంది. అయితే కొన్ని తప్పులు చేయడం వల్ల కాలేయానికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది.

1/8

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటూ అనేక విధులను నిర్వర్తిస్తుంటుంది. అయితే కొన్ని తప్పులు చేయడం వల్ల కాలేయానికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం ప్రమాదంలో పడుతుంది. ఈ అలవాటు వల్ల కాలేయ కణాలు దెబ్బతినడంతో పాటూ వాపు, మచ్చలకు కారణమవుతుంది. తద్వారా కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది.

3/8

అధిక చక్కెర గల ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా కాలేయ వాపు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.

4/8

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా కాలేయం పనితీరు మందగిస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయంలో శుభ్రపరిచే ప్రక్రియ ఆగిపోతుంది. ఇది చివరకు ఫ్యాటీ లివర్, క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

5/8

జంక్ ఫుడ్, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్ల కూడా కాలేయంపై ఒత్తిడి పడుతుంది. ఆ ఆహారంలోని అధిక ఉప్పు, నూనె.. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. చివరకు ఇది క్యాన్సర్‌కు దారి తీయొచ్చు.

6/8

పదే పదే అలసట, ఉబ్బరం, కడుపు నొప్పిగా ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ లక్షణాలు కొన్నిసార్లు చివరకు సిర్రోసిస్, క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది.

7/8

నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడి వంటివి కూడా కాలేయ సమస్యలకు దారి తీస్తాయి. అలాగే కొవ్వు పేరుకుపోయి.. కొన్నేళ్లకు కాలేయ క్యాన్సర్‌గా మారొచ్చు.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Sep 11 , 2025 | 01:32 PM