ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kitchen hack: ఫ్రిడ్జ్‌లో ఏ కూరగాయలను ఉంచకూడదో తెలుసా..

ABN, Publish Date - May 07 , 2025 | 11:46 AM

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఫ్రిడ్జ్ ఉంటుంది. దీంతో ఇంట్లో ఆహార పదార్థాలు, కూరగాయలు.. ఇలా అన్నింటినీ అందులో కుక్కేస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

1/6

ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా ఫ్రిడ్జ్ ఉంటుంది. దీంతో ఇంట్లో ఆహార పదార్థాలు, కూరగాయలు.. ఇలా అన్నింటినీ అందులో కుక్కేస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/6

వెల్లుల్లి, ఉల్లిపాయలను ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల చల్లని అవి త్వరగా మొలకెత్తుతాయి. అవి పాడవకుండా ఎక్కు రోజులు ఉండాలంటే.. ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు.

3/6

బంగాళాదుంపలను కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. అలా చేయడం వల్ల వాటి రుచి మారిపోయి.. తీయగా మారతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బంగాళాదుంపలను బయట ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.

4/6

టమాటాలను ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల వాటి ఆకృతి, రంగుపై ప్రభావం పడుతుంది. అలాగే వాటి రుచి, రసాన్ని కోల్పోతాయి.

5/6

అవకాడోలను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయడం వల్ల త్వరగా గట్టిపడిపోతాయి. అలాగే వాటి రుచి మారిపోతుంది.

6/6

పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో వీటి రుచి కూడా మారిపోతుంది.

Updated Date - May 07 , 2025 | 11:46 AM