Constipation: మీ ఆహారంలో ఈ 5 పండ్లను చేర్చితే.. మలబద్ధక సమస్యకు చెక్ పడ్డట్లే..
ABN, Publish Date - May 17 , 2025 | 07:14 AM
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిలో ఎక్కువ వేధించే వాటిలో మలబద్ధక సమస్య ఒకటి.
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వాటిలో ఎక్కువ వేధించే వాటిలో మలబద్ధక సమస్య ఒకటి. అయితే మీ ఆహారంలో కొన్ని పండ్లను చేర్చడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్ధక సమస్యకు బొప్పాయి పండు బాగా పని చేస్తుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
ఎండిన ప్లమ్ పండ్లు తినడం వల్ల కూడా మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో కరిగే ఫైబర్‌తో పాటూ కరగని ఫైబర్, సార్బిటాల్ అనే పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి.
రోజూ ఒక ఆపిల్ పండు తినడం వల్ల మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. ఈ పండ్లలోని కరిగే ఫైబర్.. పెద్ద పేగులోని నీటిని లాగి, మలాన్ని మృదువుగా చేస్తుంది. తద్వారా మలవిసర్జన సాఫీగా అవుతుంది.
బాగా పండిన అరటిపండ్లలోని పొటాషియం, ఫైబర్.. మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బెర్రీలను ఆహారంలో చేర్చడం వల్ల కూడా మలబద్ధక సమస్యను దూరం చేయొచ్చు. ఇందులోని ఫైబర్, యంటీఆక్సిడెంట్లు.. జీర్ణక్రియకు దోహదం చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - May 17 , 2025 | 07:14 AM