ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Face Health: ముఖంపై ఈ 6 సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే ముందుగానే జాగ్రత్తపడండి..

ABN, Publish Date - May 21 , 2025 | 09:48 PM

శరీరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖంపై కొన్ని సంకేతాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

1/7

శరీరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖంపై కొన్ని సంకేతాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

కళ్లు ఉబ్బిపోవడంతో పాటూ కళ్ల కింద వాపు ఉంటే నిద్ర సరిగ్గా లేకపోవడమే కాకుండా మరిన్ని సమస్యలను సూచిస్తుంది. ఎక్కువ ఉప్పు తినేవారు, అలెర్జీలు ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

3/7

కళ్ల కింద వాపుతో పాటూ నీరసంగా అనిపిస్తే.. మూత్రపిండాల పనితీరు మందగించడానికి సంకేతం కావచ్చు. సరైన ఆహారం లేకపోవడం, ఒత్తిడి కారణంగా కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

4/7

కళ్ల కింద వలయాలు కనిపిస్తే నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే ఇదే కాకుండా అలెర్జీలు, రక్తహీనత లేదా రక్తంలో చక్కెర స్థాయిలో తేడాల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.

5/7

కళ్లు ఎర్రగా ఉంటే కాలేయం ఒత్తిడిలో ఉందనడానికి సంకేతం కావొచ్చు. అతిగా మద్యం సేవించడం, శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఇలా కళ్లు ఎర్రగా మారుతుంటాయి. ఎంతకీ కళ్లలో ఎరుపు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

6/7

ముఖంపై మొటిమలు సర్వసాధారణం. అయితే మొటిమలు పోకుండా అలాగే ఉంటే మాత్రం మీ పేగు ఆరోగ్యంగా సరిగా లేదని అర్థం. పేగులకు, చర్మానికి మధ్య బలమైన సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

7/7

మీ పెదవులపై తరచూ పగుళ్లు వస్తుంటే విటమిన్- ఎ, బి2 (రైబోఫ్లేవిన్), బి12 లోపం ఉన్నట్లు అర్థం.

Updated Date - May 21 , 2025 | 09:48 PM