ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mango: మామిడి పండు కొనేముందు.. తీయగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి..

ABN, Publish Date - May 09 , 2025 | 01:52 PM

మామిడి పండు అంటే ఇష్టపడని వారుండరు. వేసవిలో మార్కెట్లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. చూసేందుకు నిగనిగలాడుతూ ఉండే మామిడి పండ్లలో కొన్ని తినాలని చూస్తే రుచిగా అనిపించవు.

1/6

మామిడి పండు అంటే ఇష్టపడని వారుండరు. వేసవిలో మార్కెట్లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. చూసేందుకు నిగనిగలాడుతూ ఉండే మామిడి పండ్లలో కొన్ని తినాలని చూస్తే రుచిగా అనిపించవు. కొనే ముందే అవి తీయగా ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

2/6

పండిన మామిడి పండు రంగు ఒకేలా ఉండదు. కొన్ని మామిడి పండ్లు పసుపు రంగులో.. మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అలాగే ఇంకొన్ని ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. మామిడి రంగు ముదురు రంగులో మెరుస్తూ కనిపిస్తుంటే బాగా పండినదని చెప్పొచ్చు. లేత, నిస్తేజమైన రంగు మామిడి పండ్లు పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది.

3/6

పండిన మామిడికాయలు ప్రత్యేకమైన తీపి వాసన కలిగి ఉంటాయి. మామిడికాయ కాండం దగ్గర తీపి వాసన వస్తే తీయగా ఉంటుంది. కొంచెం పచ్చి వాసన వస్తే అది తినేందుకు పనికిరాదని అర్థం.

4/6

మామిడికాయపై నొక్కినప్పుడు కొంచెం మృదువుగా అనిపిస్తే అది పండినది కావచ్చు. అదే గట్టిగా ఉంటే పచ్చిగా ఉందని అర్థం. అలాగని పూర్తిగా మెత్తగా ఉంటే లోపల చెడిపోయి ఉండొచ్చు.

5/6

తీయగా ఉంటే మామిడిపండ్లు కొంచెం బరువుగా అనిపిస్తాయి. ఒకేలా కనిపించే రెండు మామిడి పండ్లలో ఏది బరువుగా ఉంటే అది తీయగా ఉందని అర్థం.

6/6

మామిడి కాండం ఎండిపోవడం లేదా నల్లగా కనిపిస్తే.. లోపల కుళ్ళిపోయి ఉండొచ్చు. అదే కాండం ఆకుపచ్చ, తాజాగా కనిపిస్తే ఆ పండు బాగా బాగా పండిందని అర్థం.

Updated Date - May 09 , 2025 | 01:52 PM