Monsoon Halth Tps: వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త..
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:43 PM
వర్షాకాలంలో మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అసలే అనేక వ్యాధులు చుట్టుముట్టే ఈ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.
వర్షాకాలంలో మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అసలే అనేక వ్యాధులు చుట్టుముట్టే ఈ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. పెరుగు చాలా మందికి ఇష్టం. ఆహారంలో పెరుగు లేకుండా తినలేని పరిస్థితి ఉంటుంది. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరంలో వాత, పిత్త, కఫ దోషోలు ప్రభావితమవుతాయి. ఇవి శరీరాన్ని బలహీనపరుస్తాయి. తద్వారా మీ శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు వస్తుంది. తద్వారా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. పెరుగులో మిరియాలు, వేయించిన జీలకర్ర, తేనె కలిపి తీసుకోవడం ఉత్తమం.
వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Jul 11 , 2025 | 05:43 PM