Brain Health Tips: ఈ ఆహారాలు తీసుకుంటే చాలు.. మీ బ్రెయిన్ షార్ప్‌గా మారినట్లే..
ABN, Publish Date - Aug 19 , 2025 | 09:37 PM
మనిషి శరీరంలో మెదడు ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. శరీరంలోని అన్ని అవయవాలూ బాగా పని చేస్తాయి.
మనిషి శరీరంలో మెదడు ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. శరీరంలోని అన్ని అవయవాలూ బాగా పని చేస్తాయి. మరి ఇంతటి కీలకమైన మెదడు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాల్మన్, మాకేరెల్, సార్డిన్స్ వంటి చేపలు మెదడు ఆరోగ్యానికి బాగా పని చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలను నిర్మించడంతో పాటూ బలోపేతం చేయయడంలో సహాయపడతాయి.
బ్లూబెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు మెదడును సంరక్షిస్తాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడంతో పాటూ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయం చేస్తాయి.
పసుపులో ఉండే కుర్కుమిన్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడును కాపాడటంలో సాయం చేస్తాయి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరడంతో పాటూ మానసిక స్థితిని మెరుగుపరచే డోపమైన్, సెరోటోనిన్‌ను కూడా పెంచుతుంది.
బ్రోకలీలోని విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, ఇనుము, రాగి వంటి పోషకాలు.. మెదడును ఎక్కువ కాలం చురుగ్గా ఉండేలా చేస్తాయి.
డార్క్ చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్, కెఫిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే మానసిక స్థితిని మెరుగురుస్తాయి.
ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, గోధుమ వంటి తృణధాన్యాలు.. మెదడు ఆరోగ్యానికి బాగా పని చేస్తాయి. మెదడుకు అవసరమైన గ్లూకోజ్‌ను అందించి, చురుగ్గా ఉండేలా చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Aug 23 , 2025 | 02:12 PM