ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Papaya: బొప్పాయి తిన్న తర్వాత.. ఈ 9 పదార్థాలను అస్సలు తినొద్దు..

ABN, Publish Date - May 17 , 2025 | 01:33 PM

బొప్పాయిలో అనేక పోషక విలువలు దాగి ఉంటాయి. దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు.

1/10

బొప్పాయిలో అనేక పోషక విలువలు దాగి ఉంటాయి. దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. ఇలా తింటే ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/10

బొప్పాయి తిన్న తర్వాత కారంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇలా తినడం వల్ల వికారం, వాంతులు, కండుపులో చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి.

3/10

బొప్పాయి తిన్న తర్వాత కాకరకాయ తినకూడదు. ఇలా తింటే శరీరంలో మంటకు కారణమవుతుంది. కాకరకాయ శరీరం నుండి నీటిని గ్రహిస్తుంది. బొప్పాయిలో అధిక నీటి శాతం ఉంటుంది కాబట్టి.. ఇది అసమతుల్యతకు కారణమవుతుంది.

4/10

బొప్పాయితో పాటూ వేయించిన ఆహారాలు తినొద్దు. ఇలా తింటే శరీరంలో ఆమ్లతత్వం పెరిగిపోవడంతో పాటూ విషంగా మారుతుంది.

5/10

బొప్పాయి తిన్న వెంటనే పాలు, పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఇలా చేస్తే కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

6/10

బొప్పాయి తిన్న తర్వాత టీ తాగకూడదు. బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్, టీ ఆకుల్లోని కాటెచిన్లు కలవడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట తదితర సమస్యలు తలెత్తుతాయి.

7/10

గుడ్లు కూడా తినకూడదు. బొప్పాయిలో విటమిన్-సి, గుడ్డులోని కొవ్వు ఆమ్లాలు కలవడం వల్ల శరీరంలో ప్రతి చర్య ఏర్పడుతుంది. తద్వారా అజీర్ణం, వికారం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

8/10

బొప్పాయి తిన్న తర్వాత పెరుగు కూడా తీసుకోకూడదు. ఈ రెండూ కలవడం వల్ల శరీరంలో వాత, కఫ అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

9/10

బొప్పాయితో కలిపి పైనాపిల్ తినకూడదు. ఇలా చేస్తే కడుపులో గ్యాస్, మంట, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

10/10

బొప్పాయి తిన్న తర్వాత నిమ్మకాయ తినకూడదు. ఇలా చేస్తే శరీరంలో ఇనుము లోపం, హిమోగ్లోబిన్ అసమతుల్యత తదితర సమస్యలు తలెత్తుతాయి.

Updated Date - May 17 , 2025 | 01:33 PM