Brain Health: మీ బ్రెయిన్ షార్ప్‌గా మారాలంటే.. ఈ 6 ఆహారాలు తీసుకోండి చాలు..
ABN, Publish Date - May 20 , 2025 | 09:10 PM
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి అనేక మానసిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దాని ప్రభావం మెదడుపై పడి మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే..
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషి అనేక మానసిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దాని ప్రభావం మెదడుపై పడి మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే కొన్ని పనులు చేయడం వల్ల మన మెదడును మరింత షార్ప్‌గా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చిలగడదుంపలు, క్యారెట్లు వంటి నారింజ రంగు ఆహార పదార్థాలు మెదడుకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర, కాలే, ఆవాలు తదితర ఆకు కూరలు మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిలో ఉండే అనేక పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే మెడదకు కీలకమైన ఎసిటైల్కోలిన్ రసాయనం అందేలా చేస్తాయి.
ద్రాక్ష కూడా మెదడు ఆరోగ్యానికి బాగా పని చేస్తుంది. ఇందులోని స్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ మెదడును సంరక్షిస్తుంది.
డార్క్ చాక్లెట్ కూడా మెదడు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే ఉల్లిపాయ కూడా బాగా పని చేస్తుంది. ఇందులోని క్వెర్సెటిన్ అనే పదార్థాం. మెదడు కణాలను రక్షిస్తుంది.
వాల్‌నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కాపాడంలో సాయం చేస్తాయి. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా మెదడు ఆరోగ్యానికి బాగా పని చేస్తాయి.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రోజూ బెర్రీలు తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - May 20 , 2025 | 09:11 PM