Curd: ఈ 5 వస్తువులను పెరుగుతో కలిపి తింటే ప్రమాదంలో పడ్డట్లే..
ABN, Publish Date - Apr 15 , 2025 | 04:04 PM
కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ, పైనాపిల్, కివి వంటి పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తినకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
కారంతో కలిసిన ఆహారాన్ని పెరుగుతో కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల కడుపులో గ్యాస్, మంట తదితర సమస్యలు తలెత్తుతాయి.
చేపలు, పెరుగు కలిపి తీనకూడదు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల విషపూరితమయ్యే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుడ్డు, పెరుగులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ రెండింటిని కలిపి తినడం వల్ల అజీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
పెరుగు, టమాటను కూడా కలిపి తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Apr 15 , 2025 | 04:04 PM