ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pumpkin Seeds: రోజూ ఉదయం ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

ABN, Publish Date - May 16 , 2025 | 07:47 AM

గుమ్మడికాయ గింజల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి.

1/7

గుమ్మడికాయ గింజల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. రోజూ ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్‌ తదితర యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపు, వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడతాయి.

3/7

గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4/7

గుమ్మడి గింజలు తరచూ తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సాయపడతాయి. ఇందులోని విటమిన్-E, ఫైటోస్టెరాల్స్‌ తదితర యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలు దెబ్బతినకుండా సాయపడతాయి.

5/7

గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం.. శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సాయపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను కాపాడడంలో కూడా సాయం చేస్తాయి.

6/7

ఈ విత్తనాలు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 16 , 2025 | 07:47 AM