Fenugreek: భోజనం తర్వాత మెంతులు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Jul 10 , 2025 | 08:15 PM
భారతదేశంలో వంటకాల్లో విరివిగా ఉపయోగించే వాటిలో మెంతులు ఒకటి. మెంతుల వల్ల రుచి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే..
భారతదేశంలో వంటకాల్లో విరివిగా ఉపయోగించే వాటిలో మెంతులు ఒకటి. మెంతుల వల్ల రుచి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే భోజనం తర్వాత మెంతులు తినడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సాయం చేస్తాయి. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ దోహదం చేస్తాయి.
మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మెంతులు సాయం చేస్తాయి. అదేవిధంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటూ చుండ్రు సమస్యను నివారిస్తాయి.
చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో మెంతులు సాయం చేస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలోనూ దోహదం చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Jul 10 , 2025 | 08:15 PM