Health Tips: రోజుకు డజన్ గుడ్లు తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే..
ABN, Publish Date - May 02 , 2025 | 09:35 PM
గుడ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. రోజూ ఒక గుడ్డు తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. గుడ్లలో ప్రోటీన్, కొవ్వు, మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే..
గుడ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. రోజూ ఒక గుడ్డు తినమని వైద్యులు కూడా చెబుతుంటారు. గుడ్లలో ప్రోటీన్, కొవ్వు, మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మంచిది కదా అని ఎక్కువ గుడ్లు తింటే అనారోగ్యానికి దారి తీస్తుంది. రోజుకు 12 గుడ్లు తినడం వల్ల ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు 12 గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వారికి చాలా ప్రమాదం.
గుడ్లలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అధికంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతినడంతో పాటూ రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణశక్తికి ఇబ్బంది కలిగిస్తాయి. కడుపు ఉబ్బరంగా అనిపించడంతో పాటూ ఏది తిన్నా జీర్ణం కాకుండా ఉంటుంది. గుడ్లు ఎక్కవగా తినడం వల్ల వేరే పదార్థాలు తినలేరు. తద్వారా శరీరానికి పోషకాలు అందవు.
సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం మంచిది.
Updated Date - May 02 , 2025 | 09:35 PM