ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chia Seeds: చియా గింజలు మంచిదే అయినా.. ఈ 7 పదార్థాలతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..

ABN, Publish Date - May 10 , 2025 | 07:16 AM

చియా గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వివిధ రకాలుగా మేలు చేస్తాయి. అయితే ..

1/9

చియా గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వివిధ రకాలుగా మేలు చేస్తాయి. అయితే ఈ గింజలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2/9

చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారాలతో చియా గింజలను కలిపి తీసుకోకూడదు. చక్కెర తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. దీంతో చియా గింజల ప్రయోజనాలను పొందడంలో ఇబ్బంది కలుగుతుంది.

3/9

ఎక్కువ ఉప్పు ఉండే ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సోడియం పెరగడం వల్ల రక్తపోటు పెరగడంతో పాటూ అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

4/9

వెన్న లేదా అధిక శాతం కొవ్వు పదార్థాలతో కలిపి చియా గింజలు తినకూడదు. ఇలా చేస్తే చియా గింజల ప్రయోజనాలు పొందకపోగా.. గుండెకూ ఇబ్బంది కలుగుతుంది.

5/9

చియా గింజలతో కారం, నల్ల మిరియాలు తదితరాలు కలపకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

6/9

చియా గింజలను ఇతర విత్తనాలతో కలిపి ఎండబెట్టకూడదు. ఇలా చేస్తే కడుపులోని నీటిని పీల్చుకుంటాయి. తద్వారా కడుపు నొప్పి, అధిక బరువు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చియా గింజలను నానబెట్టిన తర్వాత తినాలి.

7/9

ఐస్‌ క్రీం, స్మూతీ తదితర తీపి పదార్థాలతో కలిపి చియా గింజలను తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు సమస్యలతో పాటూ రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది.

8/9

ప్యాక్ చేసిన రసంలో చియా గింజలను నానబెట్టకూడదు. ఇలా చేస్తే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.

9/9

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - May 10 , 2025 | 07:16 AM