Health Tips: ఈ పండును రోజుకు ఒకసారి తింటే.. వ్యాధులన్నీ పరారవ్వాల్సిందే..
ABN, Publish Date - Jun 18 , 2025 | 04:11 PM
ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి అనేక రకాల జబ్బులతో అవస్థలు పడుతున్నాడు. సరైన పోషకాహారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే మీ ఆహార అలవాట్లను కాస్త మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు..
ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి అనేక రకాల జబ్బులతో అవస్థలు పడుతున్నాడు. సరైన పోషకాహారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే మీ ఆహార అలవాట్లను కాస్త మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్లు ఆరోగ్యానికి సహకరిస్తాయని తెలుసు.. కానీ ఇప్పుడు చెప్పబోయే పండును రోజు ఒకసారి తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అవకాడోలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. చర్మ కాంతిని కూడా పెంపొందిస్తుంది.
అవకాడోలో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలతో పాటూ అనే ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అవకాడోల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ సహాయపడుతుంది. ఇందులోని లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి.
అవకాడోల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
అవకాడోలోని విటమిన్-కే.. శరీరంలో కాల్షియం పెరిగేలా చేసి, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Jun 18 , 2025 | 04:11 PM