Health Tips: ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - Aug 03 , 2025 | 12:35 PM
రోజూ ఉదయాన్నే నిమ్మకాయ రసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక లాభాలున్నాయి.
నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయాన్నే నిమ్మకాయ రసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. జీవక్రియను పెంచడంలో ఇది ప్రభావంతంగా పని చేస్తుంది.
త్వరగా బరువు తగ్గాలనుకునే వారు వ్యాయాయంతో పాటూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే ప్రయోజనం ఉంటుంది.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో నిమ్మకాయ నీరు బాగా పని చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
నిమ్మకాయ నీటిలో ఉండే అనేక పోషకాలు కడుపు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ నీరు బాగా పని చేస్తుంది.
రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిమ్మకాయ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
నిమ్మకాయలో ఉండే సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సాయం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated Date - Aug 03 , 2025 | 12:35 PM