ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: బ్రష్ చేసిన వెంటనే టీ తాగుతున్నారా.. అయితే జరిగేది ఇదే..

ABN, Publish Date - Sep 23 , 2025 | 08:37 PM

ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే టీ తాగడం సర్వసాధారణం. అయితే ఇలా దంతాలు శుభ్రం చేసుకున్న వెంటనే టీ తాగడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1/6

ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే టీ తాగడం సర్వసాధారణం. అయితే ఇలా దంతాలు శుభ్రం చేసుకున్న వెంటనే టీ తాగడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి నష్టాలు జరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2/6

బ్రష్ చేసిన తర్వాత దంతాలు కొంత సున్నితంగా మారతాయి. దీంతో వెంటనే టీ తాగడం వల్ల దంతాలపై ఎనామిల్ బలహీనపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

3/6

టీలోని టానిన్లు దంతాల ఉపరితలంపై అంటుకుపోవడం వల్ల పసుపు రంగులోకి మారతాయి. టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ దంతాలను బలపరుస్తుంది. అయితే బ్రష్ చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఫ్లోరైడ్ పొర త్వరగా తొలగిపోతుంది.

4/6

బ్రష్ చేసినప్పుడు టూత్‌పేస్ట్ దంతాల ఉపరితలాన్ని మృదువుగా చేస్తుంది. అయితే టీలోని ఆమ్లతత్వం దంతాలపై ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.

5/6

బ్రష్ చేసుకున్న తర్వాత కనీపం కనీసం 30 నుంచి 60 నిమిషాల తర్వాత తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Sep 23 , 2025 | 08:37 PM