ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే మీ కాలేయం రిస్క్‌లో పడ్డట్లే..

ABN, Publish Date - Jul 05 , 2025 | 07:02 AM

ప్రస్తుతం చాలా మంది కాలేయ సమస్యలతో సతమతమవుతున్నారు. పోషకాహారం తీసుకోకపోవడం, చెడు అలవాట్లకు బానిసలవడం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే కాలేయ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని ..

1/6

ప్రస్తుతం చాలా మంది కాలేయ సమస్యలతో సతమతమవుతున్నారు. పోషకాహారం తీసుకోకపోవడం, చెడు అలవాట్లకు బానిసలవడం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే కాలేయ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/6

ప్రస్తుతం చాలా మంది జంక్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీనివల్ల కాలేయ సమస్యలతో పాటూ అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది.

3/6

మద్యం అలవాటు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అతిగా మద్యం సేవించడం వల్ల లివర్ సిర్రోసిస్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి మద్యం అలవాటును ఇప్పటినుంచే మానుకోవడానికి ప్రయత్నించండి.

4/6

ఎర్రమాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కాలేయ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం వల్ల కాలేయానికి నష్టం చేకూరే ప్రమాదం ఉంది. దీన్ని మితంగా తీసుకోవడం ఉత్తమం.

5/6

అదనపు ఉప్పు, చక్కెర తీసుకోవడం వల్ల కూడా కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది కాలేయానికి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే అధిక చక్కెర తీసుకోవడం బరువు పెరగడానికి, మధుమేహానికి దారితీస్తుంది.ఈ కారణంగా కాలేయ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jul 05 , 2025 | 07:02 AM