ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Facial Beauty Tips: స్నానానికి ముందు 5 నిముషాల పాటు మీ ముఖంపై ఇవి రాస్తే జరిగేది ఇదే..

ABN, Publish Date - Jun 08 , 2025 | 07:10 AM

ప్రస్తుతం యువత ముఖ సౌందర్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మెరుపును తీసుకురావచ్చనే విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే ఇలా చేస్తే మీ ముఖ సౌందర్యం పెరిగే అవకాశం ఉంటుంది..

1/6

ప్రస్తుతం యువత ముఖ సౌందర్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మెరుపును తీసుకురావచ్చనే విషయాన్ని మర్చిపోతున్నారు. స్నానానికి ముందు 5 నిముషాల పాటు ముఖంపై కొన్నింటిని అప్లై చేయడం వల్ల అద్భుతమైన మెరుపు సొంతమవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

2/6

స్నానానికి ముందు కాటన్‌ను పాలలో ముంచి ముఖంపై సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా 5 నిముషాలు చేసిన తర్వాత కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై మృత కణాల తొలగిపోయి, తాజాగా కనిపిస్తుంది.

3/6

శనగపిండి, పెరుగు మిశ్రమం కూడా బాగా పని చేస్తుంది. చెంచా శెనగపిండిలో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖంపై మసాజ్ చేయాలి. 5 నిముషాలు ఇలా చేసిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది.

4/6

చర్మ సంరక్షణలో టమాటా రసం కూడా బాగా పని చేస్తుంది. టమాటా గుజ్జును ముఖంపై 5 నిముషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

5/6

స్నానానికి ముందు దోసకాయ రసాన్ని 5 నిముషాల పాటు అప్లై చేయాలి. ఇది చర్మంపై మృత కణాలను తొలగించి, మెరిసేలా చేస్తుంది.

6/6

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jun 08 , 2025 | 07:10 AM