Hair health tips: మెంతుల నీటిని జుట్టుకు రాస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
ABN, Publish Date - Sep 07 , 2025 | 05:15 PM
సాధారణంగా చాలా వంటల్లో మెంతులను ఉపయోగిస్తుంటాం. అయితే మెంతులతో జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
సాధారణంగా చాలా వంటల్లో మెంతులను ఉపయోగిస్తుంటాం. అయితే మెంతులతో జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మెంతి నీటితో ఇలా చేస్తే మీ జుట్టు దృఢంగా మారడంతో పాటూ అనేక సమస్యలు దూరమవుతాయి.
ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడగట్టాలి. తర్వాత అందులో కొద్దిగా తేలికపాటి షాంపూ వేసి దాంతో మీ జుట్టును కడగాలి.
వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ జుట్టుకు పోషణ లభించడంతో పాటూ ఆరోగ్యంగా ఉంటుంది.
మెంతి గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్- ఎ, సి, కె, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియంతో పాటూ జింక్ ఉంటాయి. ఇవి మీ జుట్టుకు పోషణ అందిస్తాయి.
చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు మెంతి గింజలతో ఇలా చేయడం వల్ల ఉమశమనం లభిస్తుంది.
దీంతో పాటు వారానికి ఒకసారి జుట్టుకు మెంతి ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇందుకోసం మెంతులను నీటిలో నానబెట్టి, కలబంద జెల్ కలిపి రుబ్బుకోవాలి. దానికి కొబ్బరి నూనె కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేస్తే జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.
మెంతి నీటిని జుట్టుకు ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. కొందరికి మెంతి నీరు అలెర్జీగా మారుతుంది. ఇలాంటి వారు తలకు అప్లై చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Updated Date - Sep 07 , 2025 | 05:15 PM