Vinayaka Chavithi 2025: లింగంపల్లిలో మొదలైన వినాయక చవితి సందడి
ABN, Publish Date - Aug 26 , 2025 | 06:23 PM
దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకల సందడి మొదలైంది. ఊరు వాడలా మండపాలు, పందిళ్లు వేసి.. గణపతిని పూజించేందుకు భక్తులు సమాయత్తమయ్యారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఏడాదిలో చాలా పండగలే వస్తాయి. కానీ అన్ని పండగల్లో వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంటుంది.
ఈ పండగ.. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.
ఈ ఏడాది వినాయక చవితి.. భద్ర పద మాసం శుక్ల పక్ష చతుర్థ తిథి ఆగస్టు 27వ తేదీన.. అంటే బుధవారం వచ్చింది.
ఈ రోజు దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోంటారు.
అలాగే ఊరు వాడ, ప్రతీ ఇంటా వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు.
ఈ పూజలో భాగంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు వివిధ మంత్రాలు పఠిస్తారు.
తొలి పూజలందుకే గణనాథుని అనుగ్రహం కోసం భక్తులు.. పత్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లు తరలి వెళ్తున్నారు.
ఆ క్రమంలో హైదరాబాద్ పటాన్‌చెరువు సమీపంలోని లింగంపల్లిలో పూజా సామాగ్రి కోసం భక్తులు మార్కెట్‌కు పోటెత్తారు.
మరోవైపు ఆకాశం మేఘావృతంగా మారింది. వర్షం పడుతున్నా.. దానిని లెక్క చేయకుండా సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు.
Updated Date - Aug 26 , 2025 | 06:24 PM