ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cyclone Montha: కుండపోత వర్షాలు.. అతలాకుతలమైన ఉమ్మడి వరంగల్

ABN, Publish Date - Oct 29 , 2025 | 09:22 PM

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

1/6

భారీ వర్షాల దాటికి హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి.

2/6

ఒక పక్క భారీ వర్షాలు.. తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. భారీ వరదకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో బిక్కుబిక్కుమంటున్నారు.

3/6

తాజాగా వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

4/6

వరంగల్‌ లోని రెడ్లవాడలో 31.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.

5/6

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 28 సెంటీమీటట్లు, పర్వతగిరిలో 27, నెక్కొండ 27, సంగెం 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

6/6

రేపు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జీడబ్ల్యూఎంసీ (GWMC) అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాత్రి ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 09:22 PM